Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ రికవరీ నోటీసులు ఇచ్చిన తరుణంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ ప్రచారం కోసం ప్రజా ధనాన్ని ఉపయోగించడం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని ఆమ్ ఆద్మీ పార్టీ ని, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ నేత హరీశ్ ఖురానా గురువారం తీవ్రంగా విమర్శించారు.
హరీశ్ ఖురానా గురువారం ఇచ్చిన ట్వీట్లో, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, ఆప్, దాని కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లకు డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ రూ.163.61 కోట్లు రికవరీ నోటీసును ఇచ్చిందని తెలిపారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఇతర రాష్ట్రాల్లో తన పార్టీ ప్రచారం కోసం వినియోగించడం ఢిల్లీ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని, నమ్మకద్రోహానికి పాల్పడటమేనని ఆరోపించారు. మీరు (అరవింద్ కేజ్రీవాల్) ప్రచారం చేసుకుంటున్నారు, కానీ అందుకు సొమ్ము ఎవరు ఇస్తున్నారు?అది ఢిల్లీ ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. ఆప్ దేశానికి క్షమాపణ చెప్పాలని, సాధ్యమైనంత త్వరగా ఆ సొమ్మును ప్రభుత్వానికి చెల్లించాలని డిమాండ్ చేశారు.