Authorization
Fri May 16, 2025 11:43:46 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 15వ తేదీ నుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడపనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి బుధవారం విశాఖపట్నం ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం స్టేషన్ నుంచి నిర్వహణ కోసం కోచింగ్ కాంప్లెక్స్‌కు తీసుకువెళుతుండగా కంచరపాలెం సమీపాన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఒక అద్దం పగిలింది. దీంతో చెన్నై నుంచి ఆగమేఘాలపై మరొక అద్దం తెప్పించి టెక్నికల్ సిబ్బందతో అమర్చారు.
వందే భారత్ రైలుపై దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దాడి జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా, మొత్తం ముగ్గురు వ్యక్తులు రాళ్లు విసిరి పారిపోయినట్టు తేలింది. అందులో ఒకరిని గుర్తించి గురువారం అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.