Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్‌లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. 64 పరుగులతో చివరివరకు క్రీజులో నిలిచిన కేఎల్ రాహుల్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
సునాయాస లక్ష్యంతోనే భారత్ బ్యాటింగ్‌కు దిగినప్పటికీ 86 పరుగులకే కీలకమైన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడ్డట్టు అనిపించింది. అయితే హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం టర్నింగ్ పాయింట్ అయింది. కీలక దేశలో పాండ్యా ఔటయినా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లతో జతకట్టిన రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు.