Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
క్యూబా విముక్తి విప్లవ నాయకుడు ఎర్నెస్టో చేగువేరా కుమార్తె ఆలైదా గువేరా ఈనెల 22న రవీంద్రభారతిలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులేనని క్యూబా ప్రతినిధులు తెలిపారు. ఈ తరుణంలో బీజేపీ, ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ ఒక ప్రకటనలో తెలిపింది.