Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జంటనగరాల పరిధిలో ట్రాక్ మెయింటెనెన్స్, ఆపరేషనల్ పనుల నేపథ్యంలో ఈనెల 13, 14 తేదీల్లో పలు మార్గాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో రాకేష్ తెలిపారు. లింగంపల్లి-నాంపల్లి రూట్లో 2, నాంపల్లి-లింగంపల్లిలో 3, ఫలక్నుమా-లింగంపల్లి రూట్లో 5 సర్వీసులను రద్దు చేసినట్లు చెప్పారు. అలాగే లింగంపల్లి-ఫలక్నుమా మార్గంలో 6 సర్వీసులు, రాంచంద్రాపురం-ఫలక్నుమాలో 1, ఫలక్నుమా-రాంచంద్రాపురం రూట్లో 1, ఫలక్నుమా-నాంపల్లి మార్గంలో 1 మొత్తం 19 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.