Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత శరద్ యాదవ్ తాజాగా మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న శరద్ యాదవ్.. నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని శరద్ యాదవ్ కుమార్తె అధికారికంగా ప్రకటించారు. ఇక, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత శరద్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి శరద్ యాదవ్ అందించిన మద్దతును సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.