Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: సంక్రాంతి పండగ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్ నుంచి సొంత వాహనాల్లో భారీగా ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. 'సొంత వాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్ ప్లాజాల వద్ద సమయాన్ని వృథా చేసుకోవద్దు. గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించవద్దు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు' అని సజ్జనార్ పేర్కొన్నారు.