Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు నియామక తుదిపరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఈ తరుణంలో షెడ్యూల్ ప్రకారం మార్చి 12, ఏప్రిల్ 23 తేదీల్లో మేయిన్స్ పరీక్షలు జరగాల్సిన తేదీలను మార్చుతూ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటన చేసింది. సబ్ ఇన్ స్పెక్టర్ (ఐటీ), అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్స్) పరీక్షలు మార్చి 12 నుంచి మార్చి 11వ తేదీకి మార్చారు. అంటే, ఒకరోజు ముందుకు జరిపారు. ఇక, కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీకి మార్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలుస్తుంది.