Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి పుణెకు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానానికి నిన్న సాయంత్రం బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ట్రైనీ టికెటింగ్ ఏజెంటే బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తేల్చారు. దీంతో బ్రిటీష్ ఎయిర్వేస్ ట్రైనీని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పుణెకు స్పైస్ జెట్ విమానం బయల్దేరే కంటే ముందు.. దాంట్లో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి చెప్పారు. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమై విమానాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అనంతరం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, బాంబు లేదని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, 24 గంటల్లోపే నిందితుడిని గుర్తించి, అరెస్టు చేశారు.