Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పేటీఎంలో ఇండియా-న్యూజిలాండ్ సిరీస్ మ్యాచ్ టికెట్లను ఉంచినట్లు హెచ్‌సీఏ తెలిపింది. ఆన్లైన్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ టికెట్లను విక్రయించనున్నారు. 39 వేల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని హెచ్‌సీఏ పేర్కొంది. మొదటి రోజు 6 వేల టికెట్లు అందుబాటులో ఉంచామని, ఈ నెల 16 వరకు టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలో క్యూఆర్ కోడ్‌తో నేరుగా టికెట్లు తీసుకోవచ్చని హెచ్‌సీఏ పేర్కొంది. గతంలో జింఖానాలో జరిగిన ఘటనలతో హెచ్‌సీఏ అలెర్ట్ అయింది.