Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కొత్త సంవత్సరం రోజున ఢిల్లీలో జరిగిన కారు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ప్రమాదంలో మృతురాలు అంజలిని ఢీకొన్న కారు.. ఆమె శరీరాన్ని కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదాన్ని వెంటనే గుర్తించడంలో నిర్లక్ష్యంతో వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. శుక్రవారం 11 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ దారుణం జరిగిన ఔటర్ ఢిల్లీలోని కంజావాలా ప్రాంతాన్ని రోహిణి జిల్లా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ విధులు నిర్వర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నిన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను ఆదేశించింది. ప్రత్యేక కమిషనర్ షాలిని సింగ్ నేతృత్వంలోని విచారణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.