Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కొలంబో
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక తమ దేశ సైన్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి ప్రస్తుతమున్న సైనిక సామర్థ్యాన్ని సగానికి తగ్గించుకోనున్నట్లు తెలిపింది. ఇదే తరుణంలో సైన్యంలో సాంకేతికతను, వ్యూహాత్మక విభాగాలను మరింత బలపరిచి తమ రక్షణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం దేశ సైనిక సామర్థ్యం 2,00,783 ఉండగా 2030 నాటికి లక్షకు పరిమితం చేయనున్నట్లు శ్రీలంక రక్షణశాఖ ప్రకటించింది. వచ్చే ఏడాది నాటికే ఈ సంఖ్యను 1.35 లక్షలకు తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2023 బడ్జెట్లో ఆరోగ్యం, విద్యకు కేటాయించిన దానికంటే చాలా ఎక్కువ మొత్తంలో సైన్యానికి కేటాయించింది. తాజా బడ్జెట్ ప్రకారం రక్షణ శాఖకు 539 బిలియన్ డాలర్లు కేటాయించగా ఆరోగ్యం, విద్య కోసం 300 బిలియన్ రూపాయల(శ్రీలంక కరెన్సీ) చొప్పున కేటాయింపులు చేసింది.
అయితే 2009లో ఎల్టీటీఈతో ఘర్షణ ముగిసిన తర్వాత శ్రీలంక తన సైనిక శక్తిని భారీగా తగ్గించుకుంది. అప్పట్లో 4లక్షల మంది సైనికులు ఉండగా ప్రస్తుతం 2లక్షలు మాత్రమే ఉన్నారు. తాజాగా ఈ సంఖ్యను సగానికి తగ్గించేందుకు సిద్ధమైంది. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతికత, వ్యూహాలను బలపరచుకోవడమే దీని ఉద్దేశమని రక్షణశాఖ సహాయ మంత్రి ప్రమితా బండారా టెన్నాకూన్ తెలిపారు.