Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే ఈనెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోఢీ ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ విశాఖ పట్నం మధ్య నడవనుంది. ఈ రైలులో 14 ఏసీ కోచ్‌లు, మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణం చేసేందుకు వెసులు బాటు ఉంది. ఈ క్రమంలో ఈనెల 16 నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ముందస్తు బుకింగ్స్‌ను శనివారం నుంచి చేసుకోవచ్చు.
అయితే ఈ వందే భారత్ ట్రైన్‌కు 20833 నంబర్ ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇది ఉదయం 5.45కు విశాఖపట్నం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుండి బయల్దేరి రాత్రి 11.30కు విశాఖ చేరుకోనుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.