Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బైక్ ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
- ముగ్గురికి గాయలు ఇద్దరి పరిస్థితి విషమం
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44 సాంపల్లి గ్రామ సమీపంలో బైక్ ను గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీ కోట్టడంతో బైక్ పై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. దినిలో ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. అర్మూర్ కు చేందిన హృషికేష్ గౌడ్, డిచ్ పల్లి కి చెందిన నల్లా అఖిలేష్, మండల కేంద్రంలోని ఘన్ పూర్ కు చేందిన దిరాజ్ లవద్దకు స్నేహితులను కలుసుకోవడం కోసం శుక్రవారం డిచ్ పల్లి వచ్చారని, తిరుగు ప్రయాణం లో బైక్ పై ముగ్గురు డిచ్ పల్లి నుండి ఆర్మూర్ వైపు వెళ్తుండాగ వేనుక వైపు నుండి వచ్చిన డిసిఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. వేంటనే ఇందల్ వాయి టోల్ ప్లాజా హైవే అంబులెన్సు లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప ఈ సంఘటన సాయంత్రం చోటు చేసుకుందని, ఈ ప్రమాదానికి కారణమైన డిసిఎం కోసం గాలింపు చేపట్టామని డిచ్ పల్లి ఎస్ ఐ కచ్చాకాయల గణేష్ తెలిపారు.