Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనేశ్వర్
హాకీ ప్రపంచకప్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. స్పెయిన్‌తో తలపడిన మ్యాచ్‌లో 2-0తో ఘన విజయంతో మెగా టోర్నీలో బోణీ కొట్టింది. భారత జట్టు వైస్ కెప్టెన్ అమిత్ రోహిదాస్ తొలి గోల్ కొట్టి ఖాతా తెరవగా.. హార్దిక్ సింగ్ రెండో గోల్ కొట్టాడు. భారత్ తరఫున అమిత్ రోహిదాస్ (12వ నిమిషంలో), హార్దిక్ సింగ్ (26వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. దీంతో మ్యాచ్ ఆఫ్ టైం ముగిసేసరికి 2 గోల్స్‌తో ఆధిక్యంలో ఉంది. భారత గోల్ కీపర్ కృష్ణ పాఠక్ మూడు సార్లు ప్రత్యర్థిని గోల్ చేయనీయకుండా అడ్డుకున్నాడు ఈ తరుణంలో ఈ మ్యాచ్ లో గెలిచిన భారత ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. జనవరి 15న జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది.