Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమరావతి
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ కోడిపందేలు జరగనున్నాయి. ప్రతీ నియోజకవర్గంలోనూ అరడజను నుంచి 10 బరుల వరకు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆచంట, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజక వర్గాలలో అధికార పార్టీ నాయకుల వారసులే కోడిపందేల నిర్వహణ బాధ్యత చేపడుతున్నారు. ఈ తరుణంలో అనుమతులకు సంబంధించి ఇప్పటికే భీమవరం నియోజకవర్గంలో అధికార పార్టీలో గ్రూపు వివాదాలు బయటపడ్డాయి. పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఉండి నియోజకవర్గంలో కాళ్ళ మండలం, భీమవరం పట్టణ శివారు, పాలకొల్లు , ఆచంట, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు మండలాల్లో చిన్న పెద్ద కోడిపందేల బరులు సిద్ధమవుతున్నాయి. వాటి వెనుకనే జూదాలు నిర్వహణ సాగుతుంది. పెద్దస్థాయిలో జరిగే బరుల వద్ద సిట్టింగ్ ఏర్పాట్లు, ఫ్లడ్లైట్లు అవసరమైన చోట ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తారు.