Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో మహిళా క్రికెట్ టీమ్ లతో ఒకటీ అరా మ్యాచ్ లు నిర్వహించిన బీసీసీఐ ఈసారి పూర్తిస్థాయిలో మహిళా ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ లో 5 ఫ్రాంచైజీలు ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఈ ఫ్రాంచైజీ పేర్లను బోర్డు ఈ నెల 25న అధికారికంగా ప్రకటించనుంది. దీంతో మహిళల ఐపీఎల్ మార్చిలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
ఈ తరుణంలో మహిళల ఐపీఎల్ లో ఐదు జట్లు ఒక్కో టీమ్ తో రెండుసార్లు ఆడతాయి. మొత్తం 20 మ్యాచ్ లు జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్ లో పోటీపడతాయి. 2, 3 స్థానాల కోసం ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు ఇప్పటికే మహిళా జట్ల కోసం బిడ్లు దాఖలు చేశాయి.