Authorization
Fri May 16, 2025 11:32:29 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మలేషియా టౌన్‌షిప్‌లో భోగి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు అందరినీ అలరించాయి.