Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ: రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భోగి శుభాకాంక్షలు తెలిపారు. పాతను వదిలి కొత్తకు భోగి మంటలు స్వాగతం పలుకుతాయన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి నివాసంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా భోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. భోగి నుంచి ఇళ్లలో పండుగ కళ వస్తుందని, తెలుగు లోగిళ్లు సరికొత్తగా కళకళలాడుతాయన్నారు. బంధువులు, స్నేహితులతో పల్లెల్లో.. పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు.
ఇండ్ల ముందు రంగవల్లులు, రథాల ముగ్గులు, గడపలకు పసుపు- కుకుమలు, దర్వాజలకు మామిడి తోరణాలు, పిల్లల తలపై రేగిపండ్లు వేస్తూ ఇచ్చే దీవెనలు, ఆకాశాన్ని వర్ణశోభితం చేసే భోగి నిజంగా భోగ భాగ్యాలు తెచ్చే పండుగ అని తెలిపారు. ఈ పండగను ప్రజలంతా కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.