Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తండ్రితో కలిసి బైకుపై వెళ్తున్న ఓ చిన్నారి మెడకు పతంగి మాంజా కోసుకుపోయి తీవ్రగాయాలపాలైంది. వనస్థలిపురం సమీపంలోని కమలానగర్లో నివసించే వినయ్‌కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతని భార్య స్నేహలతా ఉద్యోగం చేస్తోంది. వీరికి అయిదున్నరేళ్ల వయసున్న కీర్తి సంతానం. శుక్రవారం సాయంత్రం భార్యను ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద పికప్ చేసుకునేందుకు వినయ్‌కుమార్ కుమార్తెతో కలిసి బైకుపై ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ రూట్లో వెళ్లాడు. నాగోలు పైవంతెనపై వారు ప్రయాణిస్తుండగా ఎగురుతున్న గాలిపటానికి ఉన్న మాంజా పక్కనున్న కరెంటు స్తంభానికి చిక్కుకుని.. బైకుపై ముందు కూర్చున్న చిన్నారి మెడకు కోసుకుపోయి లోతైన గాయం చేసింది. ఆమె తండ్రి వినయ్ ముక్కునూ కోసేసింది. కీర్తి మెడ నుంచి తీవ్ర రక్తస్రావంతో వెంటనే సమీపంలోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం చింతల్‌కుంట రెయిన్బో ఆస్పత్రిలో చేర్పించారు. పాపకు శనివారం శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో చైతన్యపురి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.