Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో విషాదకర ఘటన జరిగింది. పంజాబ్ లోని ఫిల్లౌర్ ప్రాంతంలో ఈ ఉదయం పాదయాత్ర కొనసాగుతుండగా కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ ఛౌదరి గుండెపోటుకు గురై, కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను పగ్వారాలోని ఆస్పత్రికి తరలించారు. ఈ తరుణంలో ఆయన కన్నుమూశారు. ఆస్పత్రికి రాహుల్ గాంధీ కూడా వెళ్లారు. ఈ విషాదకర ఘటనతో భారత్ జోడో యాత్రను ఈరోజు ఆపేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ సంతోక్ సింగ్ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన మరణ వార్తతో షాక్ కు గురయ్యానని తెలిపారు.