Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ముంబై
మహేశ్ పూజారి అనే వ్యక్తి గత 25 ఏళ్ల నుంచి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్య ఆ ఇద్దరికి ఎప్పుడూ తగాదా అవుతోంది. ఈ తరుణంలో ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆ మహిళ ఆ వ్యక్తిని కోరింది. గడిచిన రెండు రోజుల నుంచి ఇళ్లు వదిలి వెళ్లిన అతను శుక్రవారం ఇంటికి వచ్చి ఆ మహిళపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. యాసిడ్ దాడితో ఆ మహిళకు 40 శాతం శరీరం కాలిపోయింది. ప్రస్తుతం ఆమెకు చికిత్సను అందిస్తున్నారు.