Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 20 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు http://tshc.gov.in సంప్రదించాలని నోటిఫికేషన్ లో తెలిపింది.
అర్హతలు: ఆర్ట్స్, సైన్స్, లా విభాగాల్లో ఏదైనా ఒకదాంట్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానమైన అర్హత
టైపింగ్ లో హయ్యర్ (ఇంగ్లిష్), పీజీ డిప్లొమా (కంప్యూటర్ ప్రోగ్రామింగ్ / కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బీసీఏ అభ్యర్థుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో (11-01-2023 నాటికి) ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు.
ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ప్రారంభంలో నెలకు రూ.38,890 చొప్పున అందుకుంటారు. సీనియారిటీ పెరిగే కొద్దీ రూ.1,12,510 వరకు జీతం పెరుగుతుంది.
దరఖాస్తుల ప్రారంభం: 21-01-2023, గడువు తేదీ 11-02-2023. 20-02-2023 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు, మార్చిలో పరీక్ష నిర్వహిస్తారు.