Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 1,74,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 79 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,936కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 2,227 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఒకరు మృతి (కేరళలో) చెందగా మొత్తం మరణాల సంఖ్య 5,30,726కి చేరింది. ఈ క్రమంలో రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయన, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.16 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.