Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. ఈ తరుణంలో వన్డే సిరీస్‌కు రోహిత్ సారథ్యం వహించనుండగా టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యానే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌ను బీసీసీఐ ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాల రీత్యా టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలను అందుబాటులో ఉండరని బీసీసీఐ అధికారులు తెలిపారు. అటు శ్రీలంకతో తొలి టీ20లో గాయపడ్డ సంజు శాంసన్‌ను కూడా సెలక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇటీవల రంజీల్లో అదరగొట్టిన పృథ్వీషాకు టీమిండియాలో చోటు దక్కింది.
29 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మకు కూడా అవకాశం లభించింది. అయితే రవీంద్ర జడేజా ఫిట్‌గా లేకపోవడం వల్ల అతడిని తీసుకోలేదని బీసీసీఐ వివరించింది. అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ నెలాఖరులో కేఎల్ రాహుల్ తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకోనున్న సందర్భంగా అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదని సమాచారం.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్, సూర్యకుమార్ యాదవ్.