Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామారెడ్డి
జిల్లాలో మాచారెడ్డి మండలంలో దారుణం చోటుచేసుకుంది. భవానిపేట గ్రామంలో నర్సవ్య, కొడుకు నర్సారెడ్డి కుటుంబం నివాసం ఉండేది. నర్సారెడ్డికి కొద్ది నెలల క్రితం పెళ్లి చేసింది నర్సవ్య. కానీ నర్సారెడ్డి భార్య తనని వదిలి వెళ్లిపోయింది. రోజు సైకోలా ప్రవర్తిస్తుండటంతో విసుగు చెందిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే నర్సారెడ్డి, తల్లి నర్సవ్యతోనే ఉంటున్నాడు. భార్య వదిలి వెళ్లిపోయిన నర్సారెడ్డిలో మార్పు రాలేదు. వ్యసనాలకు బాలిసై తల్లితో రోజు గొడపడేవాడు.
ఈ క్రమంలోనే పండుగ వాతావరణం నెలకొన్న తరుణంలో మద్యం సేవించి ఇంటి వచ్చాడు. తల్లితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్యం మాట మటా పెరిగి ఆగొడవతో తల్లిపై అతికిరాతకంగా విరుచుపడ్డాడు. తల్లిని చిత్రహింసలు పెట్టాడు. ఆమె అరుస్తూ ఉంటే చూడలేక పోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు షాక్ తగిలింది. కొడుకు అనుమాన్పదంగా మృతి చెందగా నర్సవ్యకు తీవ్ర రక్తశ్రావ్యం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.