Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ రాసినవారిలో మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తంగా 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసినట్టు తెలిపింది. ఈ మేరకు అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో కూడిన జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది. ఈ ఫలితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేసి సంప్రదించవచ్చని సూచించింది. ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని, ఆ పరీక్ష ప్యాటర్న్‌ను ఈనెల 18న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
ఈ తరుణంలో తాజాగా మల్టీజోన్లు, రిజర్వేషన్లు, జెండర్ వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే మల్టీజోన్ఉ2 పరిధిలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ (విమెన్), హియరింగ్ ఇంపెయిర్డ్ (జనరల్) కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులు లేకపోవడంతో ఆ రెండు కేటగిరీలను పక్కనపెట్టింది. మొత్తంగా 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పొందుపర్చింది. పూర్తి వివరాల కొరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ను సందర్శించ వచ్చు. అంతే కాకుండా
టీఎస్పీఎస్సీ హెల్ప్‌డెస్క్ నంబర్లు: 040-22445566, 040-23542185, 040-23542187
ఈ-మెయిల్: helpdesk@tspsc. gov. in సంప్రదించవచ్చు.