Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఈ నెల 22న రాత పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. ఈ తరుణంలో ఇంటర్ అర్హత కలిగిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు పీహెచ్డీ, ఎల్ఎల్బీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ వంటి ఉన్నత విద్యాకోర్సులు చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మొత్తం 5,03,486 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా వీరిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు ఉన్నారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున 83 మంది పోటీ పడుతున్నారు. 2018 తర్వాత దాదాపు నాలుగేళ్లకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది.