Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
క్రిప్టో కరెన్సీపై తన అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్. ఈ తరుణంలో శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ క్రిప్టోను నిషేధించాలని పిలుపునిచ్చారు. ఏ ఆస్తికైనా, ఆర్థిక ఉత్పత్తికైనా అంతర్గత విలువ అనేది ఒకటి ఉండాలని, కానీ క్రిప్టోల విషయంలో అలాంటి విలువ ఏదీ లేదని, వీటి విలువ అంతా అభూత కల్పనే అన్నారు. మన దేశంలో జూదం అడటానికి అనుమతి లేదని, జూదాన్ని అనుమతించాలనుకుంటే క్రిప్టోలను జూదంగా పరిగణించాలన్నారు.
ధనం పేరుతో జూదం ఆడటాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. క్రిప్టోకరెన్సీల వృద్ధిని ఎదుర్కొనేందుకు సెంట్రల్ బ్యాంక్ ఇటీవల తన ఈ-రూపాయి లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ని పైలట్ మోడ్లో ప్రారంభించింది. ఈ సీబీడీసీ అనేది డబ్బు భవిష్యత్ అని, దానిని స్వీకరించడం లాజిస్టిక్స్, ప్రింటింగ్ ఖర్చులను ఆదా చేయడంలో సాయపడుతుందని శక్తికాంత దాస్ తెలిపారు.