Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సంక్రాంతి పండుగ క్రమంలో తమిళనాడులోనూ, తమిళనాడు-ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారు. జల్లికట్టులో భాగంగా బలమైన ఎద్దులను బరిలోకి వదిలి వాటి కొమ్ములకు కట్టిన జెండాలను చేజిక్కించుకునేందుకు యువత పోటీలు పడుతుంటారు. ఈ తరుణంలో నేడు భోగి పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అనులోప్పల్లెలో జల్లికట్టు పోటీలు ప్రారంభం అయ్యాయి. జల్లికట్టును చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దాంతో అనుప్పల్లె గ్రామం జన సమూహంగా మారింది.