Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
లక్షద్వీప్ ఎంపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత మహ్మద్ ఫైజల్ లోక్సభ సభ్యత్వం రద్దయ్యింది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి పీఎం సయీద్ అల్లుడు పదాంత సాలిహ్పై మహ్మద్ ఫైజల్తోపాటు మరికొందరు హత్యాయత్నానికి పాల్పడినట్లు 2009లో కేసు నమోదయ్యింది. మారణాయుధాలతో దాడి చేసి గాయపర్చినప్పటికీ బాధితుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన రాజకీయ కక్షలతోనే జరిగిందనే అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్తోపాటు నలుగురిని దోషిగా తేల్చింది. వీరికి పదేళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓ కేసుకు సంబంధించి కవరత్తిలోని సెషన్స్ కోర్టు జనవరి 11న తీర్పు వెలువరించగా అదే రోజు నుంచే ఈ అనర్హత వేటు అమలులోకి వస్తుందని లోక్సభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది.