Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ
కర్ణీసింగ్ రేంజ్లో జరుగుతున్న జాతీయ షూటింగ్ ట్రయల్స్ (గ్రూప్-ఏ)లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (ట్రయల్ 1) స్వర్ణ పోరులో ఇషా 16-14 తేడాతో కర్ణాటకకు చెందిన దివ్యపై అద్భుత విజయం సాధించింది. ఈ తరుణంలో దివ్య రజతంతో సరిపెట్టుకోగా హర్యానాకు చెందిన యశస్విని సింగ్ దూస్వాల్కు కాంస్య పతకం దక్కింది.