Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ చెన్నై: కాంచీపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతి(20)ని ఆమె స్నేహితుడి ముందే ఆరుగురు కామాందులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంచీపురానికి చెందిన ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సరదాగా బయటకి వెళ్లింది. నిర్మానుష్య ప్రాంతంలో వాళ్లు బైక్ ఆపినట్లు గుర్తించిన ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి వాళ్లని సమీపించారు. ఇద్దరూ పూటుగా తాగి ఉన్నారు. యువతి బాయ్ ఫ్రెండ్‌పై దాడి చేసి అతడిని బంధించేశారు. ఆ తర్వాత మరో నలుగురు వాళ్లకు జత కలిశారు. యువతి మెడపై కత్తి పెట్టి, సహకరించకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. యువకుడు ఎంత ప్రాధేయపడినా వినిపించుకోలేదు. యువతిని దగ్గర్లోని చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి, ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడి చేశారు. ఆ తర్వాత వాళ్లిద్దర్నీ అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఈ ఆరుగురిపై అత్యాచారం, లైంగిక ఆరోపణల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.