Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఢిల్లీ శ్రద్ధా హత్య కేసులో ఇప్పటి వరకు పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఐతే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె శరీర భాగాలకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. ఈ తరుణంలో పోస్ట్మార్టం నివేదికలో పలు కీలక విషయాలు వెలుగులో వచ్చాయి.
నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేసినట్లు నివేదిక తెలిపింది. గత నెలలో నిర్వహించిన డీఎన్ఏ పరీక్షల్లో ఆ శరీర భాగాలు శ్రద్ధావేనని నిర్ధారించగా తదనంతరం వాటిని శవపరీక్షలకు పంపించారు. అలాగే ఆ ఫ్లాట్లో కనిపించిన రక్తపు మరకలు ఆమె రక్తంతో సరిపోలినట్లు నివేదికలో తెలిపింది.