Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: సూర్యుడి బాహ్యకక్ష్యలో పరిభ్రమించే ఆకుపచ్చ తోకచుక్క సూర్యుడి చుట్టూ ఒకసారి చుట్టి రావడానికి 50 వేల సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇది భూమికి, సూర్యుడికి 50 వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చేరువగా వస్తుంది. జనవరి 12న సూర్యుడికి సమీపంలోకి రాగా, వచ్చే ఫిబ్రవరి 2న భూమి సమీపంలోకి రాబోతున్నదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. పగలు అయితే బైనాక్యులర్ల సాయంతో, రాత్రిపూట అయితే నేరుగానే ఈ తోకచుక్కను వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2022లోనే చెప్పిన శాస్త్రవేత్తలు
ఈ అరుదైన ఆకుపచ్చ తోకచుక్క భూమిని సమీపిస్తున్నట్లు 2022 మార్చిలోనే జూపిటర్ సమీపంలో ఉండగా అమెరికా అంతరిక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి నాసా C/2022 E3 (ZTM) అని పేరు పెట్టింది. ఇది గతంలో 50వేల సంవత్సరాల క్రితం నియోలిథిక్ మానవుల కాలంలో భూమికి దగ్గరగా ఈ తోకచుక్క వచ్చిందని నాసా సైంటిస్టులు తెలిపారు. ఈ తోకచుక్క తిరిగే కక్ష్యలో సూర్యుడి సమీప బిందువు 1.4 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్నదని, జనవరి 12న గ్రీన్ కామెట్ ఆ బిందువును దాటేసిందని తెలిపారు.