Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగ్‌పూర్
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని బెదిరిస్తూ ఇవాళ ఉదయం నుంచి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి. నాగ్‌పూర్‌లోని నితిన్ గడ్కరీ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసిన ఓ దుండగుడు ఆయన్ని చంపేస్తానని, కార్యాలయాన్ని కూడా పేల్చివేస్తానని బెదిరించినట్లు సమాచారం. ఈ తరుణంలో ఇవాళ ఉదయం 11.30 గంటలు, 11.40 గంటల సమయంలో కాల్స్ వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నితిన్ గడ్కరీ నివాసానికి, ఆయన కార్యాలయానికి కేవలం కిలోమీటరు దూరమే ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.