Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలోని ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న 8ఏళ్ల విద్యార్థి అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను ఏఎస్పీ రోహిత్ రాజ్ భద్రాచలంలోని తన కార్యాలయంలో తెలిపారు.
జనవరి 6న బాలుడు అదృశ్యమైనట్లు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలుడు అదృశ్యం కావడానికి గల కారణాలపై దృష్టి సారించిన పోలీసులు దగ్గర్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా భద్రాచలంలోని అశోక్‌నగర్‌కు చెందిన కందుల అన్నపూర్ణ, ఆమె కుమార్తె అనూష, కుమారుడు సాయిరాం డబ్బుపై ఆశతో ఈ బాలుడిని అపహరించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఆ కుటుంబంపై నిఘా పెట్టి విచారణ చేయగా బాలుడిని రాజమహేంద్రవరానికి చెందిన స్నేహలత, ఇషాక్ గున్నం దంపతులకు మధ్యవర్తి బి.తులసి ద్వారా రూ.4.5లక్షలకు అమ్మినట్లు గుర్తించారు.
ఇందులో రూ.50వేలు మధ్యవర్తికి ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు పక్కా వ్యూహంతో ఛేదించి బాలుడిని విక్రయించిన కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. వారిచ్చిన సమాచారంతో బాలుడిని కొనుగోలు చేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.