Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతవాసులు దశాబ్దాలుగా తమ ప్రాంతాలను దోచుకుంటున్న పాక్ సర్కారు దమననీతిపై మండిపడుతున్నారు. తమను భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కార్గిల్ రోడ్డును తిరిగి తెరవాలని, భారత్‌లో కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో తమ ప్రాంతాన్ని కలిపేయాలని వారు అడుగుతున్నారు. ఆ ప్రాంతంలో 12 రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. గోధుమ, ఇతర నిత్యావసర వస్తువులపై సబ్సిడీల పునరుద్ధరించాలని, ఈ ప్రాంతంలోని సహజవనరుల దోపిడీ, భూముల ఆక్రమణను ఆపాలని వారు నినదించారు. అయితే గిల్గిత్ ప్రజలపై పాక్ సైనిక అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు.