Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తీవ్ర అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నారు. ‘రెండువారాల్లో రెండుసార్లు కరోనా సోకడంతో పాటు న్యూమోనియా బారినపడ్డాను. ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో కుమారుడి సహాయంతో ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్‌కు వచ్చి ఆస్పత్రిలో చేరాను. దురదృష్టవశాత్తు ఇప్పటికీ 24/7ఆక్సిజన్ సపోర్ట్‌తోనే ఉన్నా’ అని ఆస్పత్రి బెడ్‌పై తాను ఉన్న ఫొటోలు, వీడియోలను లలిత్ మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. లలిత్ మెడీ చేసిన పోస్ట్‌కి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భజ్జీ ఆకాంక్షించారు.