Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: దేశీయ అతిపెద్ద బ్యాంక్ హెచ్డీఎఫ్సీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ బ్యాంక్ స్టాండలోన్ పద్ధతిలో రూ.12,259.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతడేది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.10,342.2 కోట్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చినప్పుడు లాభం 18.5 శాతం పెరిగిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
స్టాండలోన్ పద్ధతిలో కంపెనీ నికర ఆదాయం సైతం మూడో త్రైమాసికంలో రూ.40,651.60 కోట్ల నుంచి రూ.51,207.61 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 30 నాటికి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఈ) 1.23 శాతంగా ఉన్నాయని బ్యాంక్ తెలిపింది. నికర నిరర్థక ఆస్తులు గత త్రైమాసికంతో పోలిస్తే 0.37 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ పేర్కొంది. వడ్డీ ద్వారా వచ్చిన ఆదాయం 24.6 శాతం వృద్ధి చెందింది. మూడో త్రైమాసికంలో మొత్తం రూ.22,987.8 కోట్ల వడ్డీ ఆదాయం సమకూరినట్లు బ్యాంక్ వెల్లడించింది.