Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పండుగ వేళ ఒడిశాలోని కటక్‌లో విషాదం చోటుచేసుకుంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని సింగనాథ్ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేలాదిమంది తరలిరావడంతో బదంబ-గోపీనాథ్‌పూర్ టి-బ్రిడ్జిపై ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.