Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాదాలు తాకేందుకు యత్నించిన ప్రభుత్వ మహిళా ఇంజినీర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్రపతి ఈ నెల 3, 4 తేదీల్లో రాజస్థాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ పర్యటనలో భాగంగా రోహెత్‌లోని స్కౌట్ గైడ్ ప్రారంభం కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. అక్కడే విధుల్లో ఉన్న ప్రభుత్వ ఇంజినీర్ అంబా సియోల్.. సభా ప్రాంగణంలో నీళ్లు అందించే బాధ్యతలు చూస్తున్నారు. అయితే ద్రౌపది ముర్ము సభా ప్రాంగణానికి చేరుకోగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అలోపే ఇంజినీర్ సియోల్.. ప్రోటోకాల్ నిబంధనలు అతిక్రమించి ఓ అడుగు ముందుకేసి, రాష్ట్రపతి పాదాలను తాకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెను రాష్ట్రపతి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ రాజస్థాన్ ప్రభుత్వం నుంచి వివరణ తీసుకుంది. స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ నియమాల ప్రకారం, సదరు ఇంజినీర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.