Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మూడో వన్డేలో మూడో వన్డేలో శతకం సాధిస్తాడని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. కోహ్లీ 30 పరుగులు స్కోర్ చేశాడంటే.. సెంచరీ చేయడం ఖాయం అని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘కోహ్లీ 40-50 రన్స్ చేసి వికెట్ సమర్పించుకునే ఆటగాడు కాదు. మంచి ఆరంభం దొరికిందంటే కచ్చితంగా సెంచరీ సాధిస్తాడు’ అని జాఫర్ తెలిపాడు. భారత్, శ్రీలంక జట్లు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో రేపు మూడో వన్డే ఆడనున్నాయి. మధ్యాహ్నం 1: 30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఇరుజట్లు తిరువనంతపురం చేరుకున్నాయి. పోయిన ఏడాది చివర్లో ఫామ్ అందుకున్న కోహ్లీ కొత్త ఏడాది మొదటి సిరీస్‌లోనే సెంచరీ కొట్టాడు. శ్రీలంకతో రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 45వ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్లో 73వ శతకం. 113 రన్స్ చేసి జట్టు విజయంలో కీలకం అయ్యాడు. ఇండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో రాహుల్ హాఫ్ సెంచరీ(64)తో ఆదుకోవడంతో 4 వికెట్ల తేడాతో గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది.