Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణ ముందస్తు పనులు శరవేగంగా సాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వచ్చే నెలలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ల నియామకం జరుగుతుందన్నారు. కన్సెల్టెంట్ కోసం బిడ్ల సమర్పణకు ఈ నెల 20వ తేదీ వరకు తుది గడువు విధించినట్లు తెలిపారు. మెట్రో అలైన్మెంట్, స్టేషన్ల కోసం ముమ్మరంగా సర్వే జరుగుతుందని స్పష్టం చేశారు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల సాయంతో సర్వే పని జరుగుతుందని పేర్కొన్నారు. 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయిందన్నారు. శంషాబాద్ సమీపంలోని ఫోర్ట్ గ్రాండ్ అండర్‌పాస్ వరకు సర్వే చేసినట్లు తెలిపారు. నెలఖారు లోపు మొత్తం సర్వే పూర్తి కానుంది. సర్వే తర్వాత అలైన్మెంట్ తెలియజేసేలా మార్కింగ్ చేస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.