Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్: యుద్ధభూమి ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా క్షిపణుల మోతమోగించింది. నిప్రో పట్టణంలోని ఓ నివాస సముదాయంపై బాంబుల వర్షం కురిపించడంతో 12 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. దేశంలోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడిందని తెలిపారు. రాజధాని కీవ్‌లోని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేసిందని వెల్లడించారు. జెలెన్స్కీ సొంతపట్టణమైన క్రివ్వీ రీహ్‌లో ఆరు ఇండ్లు ధ్వసమయ్యాయని తెలిపారు. దీంతో ఓ వ్యక్తి మరణించాడని చెప్పారు. అదేవిధంగా ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న మోల్డోవాలో కూడా క్షిపణులు పడ్డాయని ఆ దేశ అధ్యక్షురాలు మైయా స్యాండు ట్వీట్ చేశారు.