Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తమిళిసై పొంగలి అన్నం వండారు. మంచి పొంగల్, సంతోష పొంగల్, ఆరోగ్య పొంగల్, జీ20 పొంగల్ వండానని చెప్పారు. అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. ఇటీవల మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమని అన్నారు. ఈ మరణాల విషయంలో ఓ గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని చెప్పారు. అందుకే ఆ ఆస్పత్రికి వెళ్లాలని అనుకుంటున్నాని తెలిపారు. “గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారు. తెలంగాణలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగుపరచాలి. వైద్యరంగంలో మెరుగవ్వడం లేదని చెప్పడం లేదు, కానీ ఇంకా మెరుగు పరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.” అని గవర్నర్ అన్నారు.