Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రధాని మోడీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వీడియోలింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో దేశంలో ఎనిమిదో వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏండు హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. కాగా, దక్షిణ మధ్య రైల్వేలో పట్టాలెక్కిన తొలి హైస్పీడ్ రైలుగా చరిత్రలో నిలిచింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫారంపై జరిగిన ప్రారంభవేడుకల్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైశ్ణవ్, కిశన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రైలు సోమవారం (ఈ నెల 16) నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఇది సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తుంది. కాగా, ఈ రైలు మార్గంమధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలును గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. సికింద్రాబాద్- విశాఖ మధ్య 3.30 గంటల సమయం ఆదాకానుంది. తొలి రోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 21 స్టేషన్లలో ఆగనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఇవాళ ఒక్క రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు రాత్రి 9 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది.