Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎలక్ట్రిక్ బైక్ పై స్పీడ్ గా దూసుకెళ్లాలని భావించే వారికోసం జాయ్ ఈ-బైక్ కంపెనీ సరికొత్త టూవీలర్ ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. 2023 ఆటో ఎక్స్ పోలో ఈ బైక్ వివరాలను కంపెనీ వెల్లడించింది. గంటకు గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుందని పేర్కొంది. ‘మిహోస్’ గా నామకరణం చేసిన ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ధరను 1,49 లక్షలు (ఎక్స్ షోరూం) గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. నాలుగు రంగుల్లో తీసుకొచ్చిన ఈ బైక్ ను గుజరాత్ లోని వడోదర ప్లాంట్ లో తయారుచేస్తున్నట్లు వివరించింది. ఈ బైక్ లను దేశవ్యాప్తంగా డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు రంగులలో లభ్యమవుతుంది. అవేంటంటే మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ, పెర్ల్ వైట్. దీని ధర రూ. 1,49,000 ఎక్స్-షోరూమ్ (పాన్ ఇండియా) ఉంది. గుజరాత్ వడోదరలోని కంపెనీ తయారీ కేంద్రంలో దీనిని తయారుచేసి.. దశల వారీగా దేశ వ్యాప్తంగా డెలివరీలు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.