Authorization
Sat May 17, 2025 03:01:02 am
నవతెలంగాణ - హైదరాబాద్
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో కేసీఆరే సెక్రటేరియట్ ను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. అదేవిధంగా తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే కొత్త సచివాలయం పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం.