Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ నూతన సచివాలయాన్ని ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17నసచివాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టారు.